ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: 14 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. కోట్రమంగళం, పిల్లపాల్యం ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, అక్రమంగా ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాపై స్పందించిన రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి, నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనతో ఇసుక మాఫియాలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్