రేణిగుంట మండలం కరకంబాడి మంగళం రోడ్డులో ఒక యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎవరు, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.