ముక్కంటి సన్నిధిలో కర్ణాటక ఎమ్మెల్యే

కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, బీఎస్ యడియూరప్ప కుమారుడు శ్రీ బి. వై. విజయేంద్ర శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్నిసోమవారం సందర్శించారు. ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈఓ శ్రీ బి. కె. వెంకటేశులు, అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్