మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన హీరాలాల్ లాంబ్తురే (40) అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రేణిగుంటలో ఆత్మహత్య చేసుకున్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు రైలు లేకపోవడంతో ఈ నెల 23న రేణిగుంటలోని ఒక లాడ్జిలో బస చేసిన ఆయన, శుక్రవారం మధ్యాహ్నం గదిలో ఉరివేసుకుని కనిపించారు. లాడ్జి నిర్వాహకుడి ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.