తిరుపతిలోని పాత రేణిగుంటలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం శనివారం జరిగింది. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత ఈ కార్యక్రమ లక్ష్యాలు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ సూచించారు. మహిళలపై నేరాలను సహించబోమని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.