పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శనివారం సాయంత్రం త్రయోదశి సందర్భంగా వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగించిన అనంతరం, ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.