శ్రీకాళహస్తిలోని VMపల్లికి చెందిన ప్రముఖ లాయర్ పసల పొన్నారావు సోమవారం అకస్మాత్తుగా మృతిచెందారు. 2005లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆయన, 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.