బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు 14 రోజుల జైలు శిక్ష

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంటకు చెందిన రౌడీషీటర్ రెడ్డిపల్లి ఇబ్రహీం కలీల్ అలియాస్ షేక్ ఇమామ్ (29) పై నాలుగు కేసులు ఉండటంతో జూలై 20న మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. అయినప్పటికీ ఈ నెల 15న రాత్రి మద్యం మత్తులో వినాయక మండపం వద్ద స్థానికులతో గొడవకు దిగడంతో అతడిపై కేసు నమోదైంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ కావడంతో అతడికి రిమాండ్ విధించారు. ఈ సంఘటన తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕