ముక్కంటి సన్నిధిలో sac ప్రోగ్రాం చైర్మన్

శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, SAC ప్రోగ్రామ్ చైర్మన్, కుటుంబ సమేతంగా సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి, స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ శ్రీ బి. కె. వెంకటేశులు, దేవస్థాన అధికారులు, వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఐఓ శ్రీ లోకేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సి. నాగభూషణం యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్