శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వెలసిన శ్రీ శనైశ్చర స్వామి వారికి (శనివారం) విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ శనైశ్చర స్వామి వారికి పాలు, పెరుగు, పంచామృతం, తేనె, నెయ్యి వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా జరిగాయి. అనంతరం ప్రత్యేక అలంకరణ, హారతులు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందారు.

సంబంధిత పోస్ట్