శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఏపీ సీడ్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో 20 అడుగుల భారీ కొండచిలువ పాము భయపెట్టింది. గుర్తించిన బైపాస్ ఆటో స్టాండ్ డ్రైవర్లు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు.