శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర రెండో రోజు ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో పోతురాజు ముగ్గు వేసి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. రేణుకమ్మకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.