యువకుడి ఆత్మహత్య

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, తాతయ్య కాలవకు చెందిన అనిల్ (25) అనే యువకుడు ఆదివారం రాత్రి పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగిన అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు గాజులమండ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్