శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం వెదళ్ల చెరువు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ డ్రైవర్ వెనక్కి వస్తూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. క్షతగాత్రులను తిరుచానూరుకు చెందిన తులసి, పుత్తూరుకు చెందిన ప్రదీప్ గా గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించారు.