శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మడగల సాయి ఆకస్మిక మరణంతో పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, అత్తమ్మ సామాను అనసూయమ్మ, కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మడగల సాయి పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని, నిఖార్సైన కార్యకర్తగా ఆయన సేవలను బియ్యపు కుటుంబం స్మరించుకుంది.