తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, శుక్రవారం రేణిగుంట మండలం కరకంబాడి, తారకరామ నగర్‌లలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఓటర్ల జాబితా తయారే లక్ష్యంగా ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, మార్పులు-చేర్పులు, తొలగింపులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.