రేణిగుంట అభయక్షేత్రంలో ఘనంగా 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'

ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ కామరాజు, ఎంఎల్హెచ్‌పీ రేఖ బిస్మిల్లానగర్‌లోని ‘అభయక్షేత్రం’ వృద్ధులను కలసి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిపి, షుగర్ వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని సూచించారు. వృద్ధులు సమాజానికి ఆస్తి అని, వారిని ప్రేమాభిమానాలతో చూసుకోవాలని కామరాజు పేర్కొన్నారు. తమకు వైద్య సాయం అందిస్తున్న పీహెచ్‌సీ సిబ్బందికి ఆశ్రమ బాధ్యురాలు తస్లీమా భాను కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕