గృహనిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామసభ

సూళ్లూరుపేట నియోజకవర్గం, మాచవరం గ్రామంలో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ సభలో 47 మందిని గృహ నిర్మాణ శాఖ అర్హుల జాబితాలో చేర్చినట్లు తెలిపారు. 9 మంది అనర్హులను అర్హులుగా మార్చేందుకు ప్రజల నుండి సమాచారం సేకరించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్