నాయుడుపేట వద్ద రోడ్డు దాటుతుండగా లారీ డ్రైవర్‌కు దారుణం

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట–పూతలపట్టు NH71 జాతీయ రహదారిపై అక్కగారిపేట సమీపంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ దాము (54) ను గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీకొట్టి పరారైంది. పలమనేరు గ్రామానికి చెందిన దాము అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నాయుడుపేట పీహెచ్‌సీ మార్చురీకి తరలించగా, ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన 2026 మార్చి 28న చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్