సూళ్లూరుపేట హోలీ క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నాయుడుపేట వెళ్లేందుకు హైవేపైకి వస్తున్న కారును చెన్నై నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.