తడ మండలం మాంబట్టు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మునిస్వామి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్వగ్రామంలో జరుగుతున్న దేవాలయ పూజలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో సేవలందించిన ఆయన మరణం వైద్య వర్గాలను కలచివేసింది. తడ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.