రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై దిగువ చావలి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్