సూళ్లూరుపేట: నేడు ఇస్రో ‘బాహుబలి’ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. అతి భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-3 (4,410 కిలోలు)ను ఈరోజు సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు నింగిలోకి ప్రయోగించనుంది. 'బాహుబలి'గా పేరుగాంచిన ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. భూమి నుంచి ఎగిరిన 16 నిమిషాల 9 సెకన్లకే ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. భారతదేశం ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. సైనిక సమాచార అవసరాల కోసం ఈ శాటిలైట్‌ను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.

సంబంధిత పోస్ట్