సూళ్లూరుపేట: బైకుపై వచ్చి మహిళ మెడలో చైన్ తో పరార్

గుర్తుతెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి చైన్ అపహరించిన ఘటన నాయుడుపేట టౌన్లో చోటుచేసుకుంది. లోతువానిగుంటలో నివసించే తులసి(31) మంగళవారం సాయంత్రం షాప్ నుంచి ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తన మెడలో ఉన్న చైన్ లాక్కొని పరారయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్