సూళ్లూరుపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తిరుపతి జిల్లా తడలోని ఐటీఐ కాలేజీ ఎదురుగా సోమవారం ట్రాక్టర్ ఢీకొనడంతో చెన్నైకు చెందిన యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చెన్నై నుంచి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కు వెళ్తున్న షాహిదుల్లాను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షాహిదుల్లాకు తీవ్ర గాయాలు కాగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్