నాయుడుపేట పట్టణంలోని రాజుగోపాలపురంలో 29 ఏళ్ల కారణి ప్రసాద్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు రోజులుగా ఫోన్కు స్పందించకపోవడంతో స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా మృతదేహంగా కనిపించాడు. ఘటనాస్థలిలో ఖాళీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివశంకర్రావు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.