సినీ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మంగళవారం తిరుమలను సందర్శించారు. తెల్లవారుజామున అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం తెలిపి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో అధికారులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.