యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: అలిపిరి సీఐ రామకిషోర్

తిరుపతిలో యోగా శిక్షణా తరగతుల ముగింపు వేడుకల్లో అలిపిరి సీఐ రామకిషోర్ మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ఎంతో అవసరమని, దీనిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక జీవ లింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగ మాస్టర్ గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్