లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్

తిరుపతి జిల్లా మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గుడిమల్లంలో ఒక రైతు తన భార్య పేరు మీద మత్స్య శాఖ ప్లాంట్ ఏర్పాటుకు రాయితీ అనుమతి కోసం రెడ్డన్నను సంప్రదించగా, ఆయన రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. రైతు రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో, జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో రైతు నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్డన్నను అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్