తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు ఇచ్చి మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. బెంగళూరులోని వర్షా ట్రావెల్స్ సంస్థ ఒక్క భక్తుని నుంచి రూ. 3,350 వసూలు చేసి, రవాణా దర్శనం కల్పిస్తామని చెప్పింది. కానీ నకిలీ టికెట్లు ఇచ్చింది. వాటితో తిరుమల చేరిన 35మంది కన్నడ భక్తులను టీటీడీ అధికారులు నిలువరించగా, అవి అసలైనవి కాదని గుర్తించారు.