తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల వద్ద ఉన్న ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో చోరీ జరిగింది. ఓ మహిళ తాకట్టు పెట్టిన 60 గ్రాముల బంగారాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అప్రైజర్ బంగారాన్ని తనిఖీ చేస్తుండగా అదమరిచిన సమయంలో ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తి వార్తాపత్రికను అడ్డుపెట్టి బంగారాన్ని అపహరించాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.