శ్రీవారి మెట్టు మార్గంలో ఎన్నారై భక్తుడు మృతి

తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్తున్న సింగిరెడ్డి సుర్జిత్ రెడ్డి అనే ఎన్నారై భక్తుడు గుండెపోటుతో మరణించారు. 800వ మెట్టు వద్దకు చేరుకోగానే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కిందికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దురదృష్టకర ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భక్తుని మరణంపై వివరాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕