పెదనాన్న ఇంట్లో నగలు కొట్టేసిన కుమారుడు

చెన్నారెడ్డి కాలనీలో ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు ఇంట్లో పెళ్లి కోసం సిద్ధం చేసిన 177 గ్రాముల బంగారు నగలను పక్కా ప్రణాళికతో దొంగిలించారు. గురువారం ఉదయం నాగరాజు విధులకు వెళ్లగా, భార్య సుశీలమ్మ కుమార్తెతో కలిసి నాయుడుపేటకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చి చూడగా బీరువాలో నగలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వదిలి వెళ్లిన కుక్క అరవకపోవడం, పట్టపగలు చోరీ జరిగినా అలజడి లేకపోవడంతో పోలీసులు ఇంటి దొంగలపై అనుమానం పెంచుకున్నారు. నాగరాజు తమ్ముడి కుమారుడు పృథ్వీపై అనుమానం వచ్చి విచారించగా, మూడు నెలల కిందటే పెదనాన్న ఇంటి తాళం చెవిని కాజేసి, పెళ్లి కూతురితో ఫోన్ చాటింగ్ ద్వారా సమాచారం సేకరించి, ఇంట్లోకి చొరబడి నగలు దొంగిలించినట్లు అంగీకరించాడు. శుక్రవారం రాత్రి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్