తిరుమల: భార్యాభర్తలు ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్ గురువారం రూము తీసుకున్నారు. శుక్రవారం నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్