సీతారామపురం మండలం, పోలంగారిపల్లి గ్రామం, చిట్టిబొయిన చెన్నయ్య అనే వ్యక్తి ఆరోగ్యం సరిగా లేక సంవత్సరం నుంచి మంచంలో ఉన్నాడు. వాళ్ళకి ఇంట్లో పోషణకు చాలా కష్టంగా ఉందని తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ బొగినేని కాశీరావు పలువురు జనసైనికులతో కలిసి వారి నివాసానికి మంగళవారం వెళ్లి నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే కొంత నగదును ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు ఇచ్చారు.