వెంకటగిరి హైవేపై ఆటో బోల్తా – 9మందికి గాయాలు

వెంకటగిరి హైవేపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది గాయపడారు. రేణిగుంట నుంచి వెంకటగిరికి వస్తున్న ఆటో ఎంపేడు గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను వెంటనే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్