వెంకటగిరిలో తగలబడిన పల్సర్ బైక్

వెంకటగిరిలో శనివారం పల్సర్ బైక్‌ తగలబడిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి తన పల్సర్ బైక్‌లో పెట్రోల్ లీక్ అవుతుందని మెకానిక్‌కు ఇచ్చాడు. కిక్ కొడుతుండగా స్పార్క్ రావడంతో బైక్‌లో మంటలు చెలరేగాయి. ఇది చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్