వెంకటగిరి: ప్రైవేట్ బస్సును ఢీ కొట్టిన కారు

వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని పెరియారం మోడరన్ స్కూల్ మలుపు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మేనకూరు పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీకి వెళ్తున్న బస్సును వెంకటగిరి నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న కార్మికులకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్