నేడు ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు

AP: సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలోని నాలుగు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శనివారం ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిట్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. నల్లమాడ, బుక్కపట్నం, పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్