భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కేజీ రూ.1

AP: రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం విశాఖ జిల్లా దేవరపల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు భారీగా పంట రావడంతో 30 కేజీల బాక్స్ ధర కేవలం రూ.30 నుంచి రూ.50 మాత్రమే పలికింది. అంటే కేజీ టమాటా కేవలం రూ.1 నుంచి రూ.1.5. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు రాకపోవడంతో మనస్తాపం చెందిన రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసేస్తున్నారు.

సంబంధిత పోస్ట్