ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. అటు అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని నాలుగు మండలాల్లోని స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.