AP: తిరుమలలో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.