కుండపోత వర్షం.. భారీగా ఈదురుగాలులు (వీడియో)

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు  బీభత్సం సృష్టిస్తున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 23.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 22.45, బాపట్ల జిల్లా పర్చూరులో 21.3, కడప జిల్లా కాశినాయనలో 17.5 సెం.మీ వర్షం కురిసింది. తుఫాన్ తీరం దాటిన నరసాపురం.. పశ్చిమగోదావరి జిల్లా భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది, అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్