కుండపోత వర్షం.. నిలిచిపోయిన రవాణా (వీడియో)

AP: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కురుస్తున్న కుండపోత వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. హాలహర్వి వద్ద నడిమివంక, హత్తిబెళగల్ సమీపంలోని కళ్లెవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్నూలు–బళ్లారి, గుంతకల్లు–ఆలూరు ప్రధాన రహదారులపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్