ఏపీలో కుండపోత వర్షాలు.. ముంచెత్తిన వరదలు (వీడియో)

ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా కృష్ణా, తూర్పుగోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అలాగే పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతూ, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕