పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. జనసైనికుడు మృతి

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో విషాద ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందాడు. మృతుడిని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్‌(22)గా గుర్తించారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తల్లో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్