విషాదం.. విద్యుత్ షాక్ తగిలి రైతు కూలీ మృతి

AP: కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో రైతు కూలీ మృతి చెందాడు. చక్రాయపేట మండలం నడింపల్లికి చెందిన ఇండ్లోల్ల ఓబులేసు(23) అనే రైతు కూలీ నీలం వెంకట శివ రైతు పొలంలో విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్