AP: చిత్తూరు జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వి.కోట మండలం నాయకనేరి టోల్ ప్లాజా వద్ద గురువారం ఉదయం గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులపైకి ఐషర్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కుప్పం పీఎస్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.