AP: పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం ఆర్యపేటలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న ఈదా దావీదు (52)కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని పాలకొల్లులోని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి ఇలా హఠాన్మరణం చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.