AP: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థి నాగమహేశ్వర్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన మహేశ్వర్ గత రెండు రోజులుగా కాలేజీకి హాజరు కాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తోటి విద్యార్థులు గది తలుపు బద్దలు కొట్టి చూడగా నాగమహేశ్వర్ ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు సీఎస్ దర్యాప్తు చేస్తున్నారు.